News November 14, 2025

టీయూ: ఎంఏ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ పరీక్ష ఫలితాలు విడుదల

image

తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్‌, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి డాక్టర్ తోకల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. గంభీరావుపేటలో రూ.14 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంలను, పోషకాహారాన్ని ఆమె పంపిణీ చేశారు.

News November 14, 2025

నస్పూర్: ఆరోగ్యకర అలవాట్లతో మధుమేహం నియంత్రణ

image

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, రక్తపోటును నియంత్రించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నస్పూర్‌లో అధికారులు, సిబ్బందికి నిర్వహించిన మధుమేహం, రక్తపోటు పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 24,430 మందిలో మధుమేహాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

News November 14, 2025

వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.