News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
News November 14, 2025
వేంకటేశ్వరస్వామి: మీకు ఈ కథ తెలుసా?

తిరుమల సోపాన మార్గంలోని మోకాలి మెట్టు వద్ద రాతి పెట్టెలుంటాయి. అవే పద్మావతి అమ్మవారి 7 వారాల సార్లపెట్టెలని నమ్మకం. వివాహం తర్వాత శ్రీనివాసుడు, పద్మావతి కొండకు బయలుదేరారు. అప్పుడే స్వామివారికి ఇల్లాలున్న విషయం గుర్తొచ్చింది. దీంతో పద్మావతిని ‘కరివేపాకు తెచ్చావా?’ అని అడిగి, తిరిగి పంపాడు. అలా వెనక్కి వెళ్లి అమ్మవారు తిరుచానూరులో శిలగా మారారు. ఈ పెట్టెలు నగల కోసమేనని నమ్ముతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 14, 2025
NMLలో 21 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

NTPC మైనింగ్ లిమిటెడ్(NML)లో 21పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CMA, ఇంజినీరింగ్ డిగ్రీ( ఎన్విరాన్‌మెంట్ ), పీజీ డిప్లొమా, MSc, ఎంటెక్, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://nml.co.in/en/jobs/


