News November 29, 2025
తప్పు చేసినవారికి శిక్ష పడితే మళ్లీ నేరం చేయడానికి భయపడతారు: ఎస్పీ

పుట్టపర్తి సాయి ఆరామంలో అన్ని సబ్ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులతో ఎస్పీ సతీశ్ కుమార్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. తప్పు చేసినవారికి శిక్ష పడితే మళ్లీ నేరాలు చేయడానికి భయపడతారని, ఆ దిశగా పోలీస్ శాఖ పనిచేయాలని ఆదేశించారు. మహిళా నేరాలు, పోక్సో, ఎన్‌డీపీఎస్, మర్డర్, చోరీలు, ప్రాపర్టీ నేరాలు, మిస్సింగ్, గ్రేవ్, పెండింగ్ కేసులపై ఆయన ఆరా తీశారు.
Similar News
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


