News November 12, 2025

తిరుమలలో త్రోవ భాష్యకారుల సన్నిధి ఎక్కడుంది?

image

తిరుపతి నుంచి తిరుమలకు కాలి నడకన వెళ్లే దారిలో మోకాళ్ల పర్వతం తోవలో భాష్యకారుల సన్నిధి ఉంది. భాష్యకారులంటే శ్రీమద్రామానుజులే. కాలినడక దారిలో ఉండడంతో దీన్ని త్రోవ భాష్యకారుల సన్నిధిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఓ చిన్న మండపం, ఓ దేవాలయం కూడా కనిపిస్తాయి. తిరుమలకు శ్రీమద్రామానుజులు వెళ్తుండగా తిరుమల నంబి ఈ ప్రదేశంలోనే ఆలయ మర్యాదలతో స్వాగతం చెప్పారని పెద్దలు చెబుతారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News November 12, 2025

అయోడిన్ లోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు

image

థైరాయిడ్ హార్మోన్లు, ట్రైయోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) సరైన మోతాదులో విడుదల కావడానికి అయోడిన్ చాలా అవసరం. అయితే అయోడిన్‌ లోపాలున్న పిల్లలు అత్యధికంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే 82.5% ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక తెలిపింది. దీనిలోపంతో పిల్లల్లో ఎదుగుదల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ అధికంగా ఉంటుంది.

News November 12, 2025

ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

image

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.

News November 12, 2025

రేపు విచారణ.. ఇవాళ క్షమాపణ!

image

TG: నాగార్జున ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ మరోసారి <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడం చర్చకు దారితీసింది. సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆమె ఒకరోజు ముందు ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ ‘సారీ’ని స్వీకరించి నాగార్జున కేసును వెనక్కి తీసుకుంటారా? లేక ముందుకే వెళ్తారా? అనేది రేపు తేలనుంది.