News December 5, 2025
తిరుమల దర్శనం టికెట్లు.. భక్తులకు గమనిక

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 10రోజులు SSD(తిరుపతిలో ఇస్తున్న టైం స్లాట్) టోకెన్లు జారీ చేయరు. తొలి 3రోజులు ఆన్‌లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తారు. తర్వాత నుంచి వచ్చే వారంతా నేరుగా కొండకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 నుంచి దర్శనానికి వెళ్లవచ్చు. జనవరి 2నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి టికెట్లను ఇవాళ ఉదయం 10గంటలకు రిలీజ్ చేయగా.. SED(రూ.300) టిక్కెట్లు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల కానున్నాయి.
Similar News
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్‌లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
News December 7, 2025
ములుగు: రెండో విడతలో 11 జీపీలు ఏకగ్రీవం

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న 52 గ్రామ పంచాయతీల్లో 11 పంచాయతీ కార్యవర్గాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. గుర్తూరు తండా, ముద్దునూరుతండా, అంకన్నగూడెం, బంజరుపల్లి, జగ్గన్నపేట, కొత్తూరు, పెగడపల్లి, రాయినిగూడెం, అడవి రంగాపురం, నర్సింగాపూర్, తిమ్మాపూర్ గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
News December 7, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


