News December 5, 2025
తిరుమల: VIP బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
Similar News
News December 7, 2025
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

TG: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. కరీంనగర్(D) చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను గెలిపిస్తే 12పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు. 3ఏళ్లలో వీటిని పూర్తిచేయకపోతే రాజీనామా చేస్తానన్నారు.
News December 7, 2025
MHBD: కాంగ్రెస్‌లో రెబల్స్ బెడద!

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్‌లు ముగిశాయి. మరిపెడ, దంతాలపల్లి, తొర్రూర్ మండలాల్లో రెబల్స్ బెడద ఎక్కువైంది. వారిని బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు. ఈసారి తప్పుకో.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామంటూ ఆయా గ్రామ పంచాయతీల నాయకులు చర్చలు జరుపుతున్నారు.
News December 7, 2025
అర్జీలను మీకోసం వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేయవచ్చు: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం తెలిపారు. అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు. మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో కూడా అర్జీలను సమర్పించవచ్చని ఆమె చెప్పారు.


