News November 14, 2025
తెలంగాణ రౌండప్

* ఈ నెల 17 నుంచి 22 వరకు సర్కారు స్కూళ్లను తనిఖీ చేయనున్న ఉన్నతాధికారులు.. సేఫ్ అండ్ క్లీన్, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించనున్న స్పెషల్ అధికారులు
* చిన్న చిన్న కారణాలతో 2021 నుంచి తొలగించిన 1,300 మంది ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి
* సమ్మె కారణంగా వాయిదా పడిన ఫార్మసీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం..
Similar News
News November 14, 2025
స్పోర్ట్స్ రౌండప్

⋆ నోయిడాలో నేటి నుంచి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నీ. 51 కేజీల విభాగంలో పోటీ పడనున్న నిఖత్ జరీన్.. బరిలోకి మరో 19 మంది భారత బాక్సర్లు
⋆ చెస్ WC నుంచి ప్రజ్ఞానంద ఔట్.. ప్రీ క్వార్టర్స్‌కు అర్జున్, హరికృష్ణ
⋆ ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్: వ్యక్తిగత, టీమ్ కాంపౌండ్ ఈవెంట్స్‌లో ‘గోల్డ్’ సాధించిన జ్యోతి సురేఖ
⋆ నేటి నుంచి ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టోర్నీ.. UAEతో IND-A ఢీ
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.
News November 14, 2025
డెలివరీ తర్వాత ఇలా చేయండి

బిడ్డను ప్రసవించిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి డీహైడ్రేట్ అవ్వకుండా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సాధారణ ప్రసవం తర్వాత చాలావరకు ఇబ్బందులు తలెత్తవు. సిజేరియన్ జరిగితే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరం. సిజేరియన్ జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి.


