News November 12, 2025
త్వరలో రెండు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు: తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ (15-60 టన్నుల సామర్థ్యం) జనవరి 2026లో, కల్లూరుగూడెం (ఖమ్మం)లో ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ (15-60 టన్నుల సామర్థ్యం) జూన్ 2026లో ప్రారంభం కానున్నట్లు మంత్రి వెల్లడించారు.
Similar News
News November 12, 2025
కోనసీమ: టెన్త్ విద్యార్థులకు alert..షెడ్యూల్ విడుదల

2025-26 విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో సలీంబాషా తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 13 – 25 వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 3 వరకు చెల్లించవచ్చన్నారు.
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
సిద్దిపేట: దయ జూపరా మాపై కొడుకా!

అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు మిట్టపల్లి వెంకటయ్య, లక్ష్మి తమ ఇద్దరు కుమారులు బాగోగులు చూసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సంపాదించిన 8 ఎకరాల భూమిని ఇద్దరికీ రెండు భాగాలుగా పంచి ఇచ్చినప్పటికీ ఎవరు కూడా చూడడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తిండి పెట్టాలని అడిగినందుకు కొట్టి, కాళ్లు విరగొట్టారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


