News November 12, 2025

దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.

Similar News

News November 12, 2025

పెద్దపల్లి: ‘17% లోపు తేమతోనే ధాన్యం తీసుకురావాలి’

image

రైతులు వరి ధాన్యాన్ని 17%లోపు తేమ వచ్చాక మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని బుధవారం పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. పొలంనుంచి నేరుగా కాకుండా ముందుగా బాగా ఆరబెట్టాలని, రాత్రిపూట ప్లాస్టిక్ కవర్లు కప్పి తేమ పెరగకుండా చూడాలని చెప్పారు. నాణ్యమైన ధాన్యం తీసుకువస్తే అదే రోజు కాంటా వేసి మిల్లులకు తరలిస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సూచనలు పాటించాలని కోరారు.

News November 12, 2025

హైదరాబాద్‌లో జగిత్యాల వాసి అనుమానాస్పద మృతి

image

వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన ఘటన HYDలోని మియాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలకు చెందిన సతీశ్ మియాపూర్‌లోని హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి సతీశ్ హాస్టల్‌లోని తన రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హాస్టల్ యజమాని చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి కేసు నమోదు చేశారు.

News November 12, 2025

పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చోడవరం తరలింపు

image

వడ్డాదిలో <<18264743>>పిచ్చికుక్క <<>>దాడితో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చోడవరం CHCకి తరలించినట్లు డాక్టర్ రమ్య తెలిపారు. వడ్డాది PHCలో రేబీస్ వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్స అనంతరం బాధితులను తరలించామన్నారు. కాగా పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారి సంఖ్య 15కి చేరుకుంది. గాయపడిన వారు ఒక్కొక్కరు ఆసుపత్రికి వస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.