News November 12, 2025
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాల గురించి చర్చించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 12, 2025
రైలు ఢీకొని ఏల్చూరు మహిళ మృతి

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కూరగాయల మార్కెట్ సమీపాన రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సమాచారం మేరకు సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన పోలిశెట్టి మహాలక్ష్మి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 12, 2025
KMR: వైద్య వృత్తిలో సేవా భావంతో పనిచేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సర 100 మంది విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.
News November 12, 2025
అభివృద్ధి పథంలో పర్యాటక రంగం కీలకం: కలెక్టర్

స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్యమని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కలెక్టర్ బుధవారం ట్రెయినీ ఐఏఎస్ అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు. కొండపల్లి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని వివరించారు.


