News January 14, 2026
నక్కపల్లి: రైతు గెటప్‌లో ఎడ్లబండి తోలిన హోంమంత్రి

హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఉదయం నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా రైతు గెటప్‌లో మంత్రి ఎడ్ల బండి తోలి సందడి చేశాసారు. పండుగ అందరి ఇళ్లలో భోగభాగ్యాలను నింపాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల్లో టీడీపీ నాయకులు, నియోజకవర్గం జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 21, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓కర్రేగుట్టలో కూంబింగ్ నిలిపివేయాలి: కొత్తగూడెం ఎమ్మెల్యే
✓దమ్మపేటలో ఇన్వెస్ట్మెంట్ పేరిట రూ.26 లక్షలు మోసం
✓భద్రాద్రి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
✓రోడ్డు ప్రమాదంలో సారపాక విద్యార్థి దుర్మరణం
✓గుండాల: విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన ఆటో
✓కొత్తగూడెం, టేకులపల్లి గ్రంథాలయాలు సందర్శించిన ఐటీడీఏ పీవో
✓ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ
✓జూలూరుపాడు: శిధిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాల
News February 21, 2026
‘వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పశు వైద్య శిబిరాల ఏర్పాటు’

వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయన్నారు. ప్రతి మార్కెట్ కమిటీ పరిధిలో రెండు పశువైద్య శిబిరాలను నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31నాటికి పశువైద్య శిబిరాల ఏర్పాటు పూర్తి కావాలని ఆమె స్పష్టం చేశారు.
News February 21, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.


