News November 12, 2025
నల్గొండ: భయపడుతూ.. నేల మీదే చదువులు

మునుగోడు(M) రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల వలయంలో చిక్కుకున్న ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించాలంటే ఆరుబయట రేకుల షెడ్డు కింద నేలపైన కూర్చోవాల్సి వస్తోంది. డెస్క్ బెంచీలు కూడా లేవు. ముఖ్యంగా, పాఠశాల ఆవరణ గుంతలమయంగా మారడంతో విద్యార్థులు ఆడుకోవడానికి వీలు లేకుండా పోయింది. సమస్యలు పరిష్కరించాలని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
Similar News
News November 12, 2025
MHBD కలెక్టరేట్‌లో జిల్లా దిశా కమిటీ సమావేశం

MHBD కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం కమిటీ ఛైర్మన్, ఎంపీ పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎమ్మెల్యే మురళీ నాయక్, లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు ఉన్నారు.
News November 12, 2025
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
పెద్దపల్లి: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్‌ను బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) దాసరి వేణు ఆవిష్కరించారు. వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వయోవృద్ధులు తమ సమస్యలపై టోల్ ఫ్రీ నం.14567ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (ఇన్‌ఛార్జ్) కవిత, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత పాల్గొన్నారు.


