News January 8, 2026

నాన్న ఛాతీనే ❤️ పట్టుపాన్పు

image

భక్తుల శరణుఘోషలు, విపరీతమైన చలి.. ఇవేమీ లెక్కచేయకుండా నాన్న ఛాతీపై హాయిగా నిద్రపోతున్న కన్నెస్వామి ఫొటో వైరలవుతోంది. తండ్రితో కలిసి ఆ మణికంఠుడిని దర్శించుకుని ఈ చిన్నారి అలసిపోయింది. నాన్న గుండెచప్పుడే గుడి గంటలుగా, ఆయన ఒడే పట్టుపాన్పుగా, ప్రపంచంలోనే సురక్షిత ప్రదేశంగా భావించి నిద్రపోయింది. ఆ తండ్రి కూడా బిడ్డ నిద్రకు భంగం కలిగించకుండా కదలకుండా ఉండిపోయాడు. ఎంతైనా అమ్మాయికి తండ్రే కదా సూపర్ హీరో.

Similar News

News February 21, 2026

TODAY HEADLINES

image

* ట్రంప్ టారిఫ్‌లను రద్దు చేసిన US సుప్రీంకోర్టు
* USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్
* AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం
* APR 1 నుంచి టోల్‌ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్
* క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి: CBN
* ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్
* CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి
* ఏఐ వార్‌రూమ్‌కు HYD అనువైన ప్రదేశం: రేవంత్
* TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

News February 21, 2026

ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పర్యటించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. చైనాపై అడ్డగోలుగా టారిఫ్‌లు వేయడం వాటికి ప్రతిగా బీజింగ్ సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య జరగనున్న దౌత్యపరమైన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.