News December 9, 2025
నిజామాబాద్: ‘అప్పులైనా సరే.. గెలుపే ముఖ్యం’

ఉమ్మడి NZB జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి ఏర్పడింది. రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రజల మధ్య పరస్పర భేటీ జరుగుతోంది. అప్పులకు పాలవ్వకుండా సర్పంచ్ పదవికి దూరంగా ఉండాలని పలువురు చెపుతున్నప్పటికీ..ఎంత అప్పులైనా సరే, తమకు గెలుపే ముఖ్యం అంటూ ఓ వైపు అభ్యర్థులు అంటున్నారు. ఈ నెల 11న తోలి విడత పోలింగ్ ఉండడంతో కనీసం ప్రచారాలు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్‌కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్‌ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.
News December 9, 2025
భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.
News December 9, 2025
జిల్లాకు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి: ఎంపీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ హరీశ్ లోక్‌సభలో 377 నిబంధన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య సదుపాయాల లోపం, ట్రామా కేంద్రాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. మంజూరైన క్యాన్సర్ డే సెంటర్‌ను వేగంగా నిర్మించాలని ఎంపీ కోరారు.


