News November 14, 2025
నిర్మల్: ఐరన్ మ్యాన్ అవార్డు గ్రహీతకు సన్మానం

నిర్మల్‌లోని మారుతి ఇన్‌లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పలువురిని సన్మానించారు. ‘ఐరన్ మ్యాన్ అవార్డు’ సాధించిన డాక్టర్ బి.ఎల్. నరసింహారెడ్డిని, అలాగే రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇద్దరినీ సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ల సేవలను ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, అభిమానులు పాల్గొని అభినందనలు తెలిపారు.
Similar News
News November 14, 2025
ఈ 3 కారణాలతోనే బిహార్‌లో ఓటమి: కాంగ్రెస్ లీడర్లు

బిహార్ ఎన్నికల్లో ఈసారైనా తమకు అధికారం దక్కుతుందని ఆశపడిన కాంగ్రెస్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. NDA భారీ విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీ, ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓటు బ్యాంక్ కోల్పోవడం, గతంలో ఎన్డీయేలో ఉన్న అభ్యర్థులకు టికెట్లివ్వడం, SIR, ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడం తమ ఓటమికి కారణాలుగా వారు భావిస్తున్నారు. కాగా NDA 200+ స్థానాల్లో లీడ్‌లో ఉంది.
News November 14, 2025
KCR ప్రచారం చేసుంటే…

TG: హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో KCR ప్రచారం చేయగా అప్పట్లో BRS గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్, కంటోన్మెంటు ఉపఎన్నికల్లో ఆయన ప్రచారం చేయలేదు. పార్టీ ఓడింది. ఈసారి ‘జూబ్లీ’ ప్రచారానికి వస్తారని నేతలు ఎదురుచూశారు. అయితే ఆయన పూర్తి బాధ్యతలు KTRకు అప్పగించారు. KTR ఎంతో శ్రమించినా అనుకున్న ఫలితం రాలేదు. KCR వచ్చుంటే గెలిచేదని BRS శ్రేణుల భావన.
News November 14, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 4

18. నిద్రలో కూడా కన్ను మూయనిది?(జ.చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?(జ.అస్త్రవిద్యచేత)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?(జ.యజ్ఞం చేయుట వలన)
21. జన్మించినా ప్రాణం లేనిది?(జ.గుడ్డు)
22. రూపం ఉన్నా హృదయం లేనిది?(జ.రాయి)
23. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(జ.శరణుకోరిన వారిని రక్షించకపోతే)<<-se>>#YakshaPrashnalu<<>>


