News November 12, 2025

నిర్మల్: 14న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఈనెల 14న ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సమావేశం నిర్వహించే విద్యార్థుల ప్రగతిని వారికి వివరించాలన్నారు.

Similar News

News November 12, 2025

వంటింటి చిట్కాలు

image

* బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.
* గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.
* బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్‌లో ఉంచండి.
<<-se>>#VantintiChitkalu<<>>

News November 12, 2025

కర్నూలులో గవర్నర్‌కు ఆత్మీయ స్వాగతం

image

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌‌కు కర్నూలు విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ప్రత్యేక విమానంలో విచ్చేశారు. మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్‌ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరారు.

News November 12, 2025

HYD: అర్ధనగ్నంగా హిజ్రాలు.. పోలీసుల WARNING

image

గ్రేటర్ HYDలో హిజ్రాల ఆగడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఫంక్షన్ చేయాలన్నా వీళ్లతో భయమైతుందని వాపోతున్నారు. తాజాగా HYD-శ్రీశైలం హైవేపై రాత్రిళ్లు హిజ్రాలు అర్ధనగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో పహాడీషరీఫ్ పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అరెస్ట్ చేసి, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.