News November 2, 2025

నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

image

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.

Similar News

News November 2, 2025

ఉండవెల్లి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అక్టోబర్ 30వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న మెన్నిపాడు గ్రామానికి చెందిన శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మృతుడు భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, సంఘటనకు కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

News November 2, 2025

వినుకొండ: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

వినుకొండ పట్టణ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

News November 2, 2025

NOV.4న తిరుపతి జిల్లా కబడ్డీ జట్ల సెలక్షన్ ట్రయల్స్

image

37వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే తిరుపతి జిల్లా బాలురు, బాలికల జట్ల ఎంపిక కోసం ట్రయల్స్ నవంబర్ 4న మధ్యాహ్నం 2 గంటలకు నాగలాపురం పాఠశాల మైదానంలో జరగనున్నాయి. బాలురు 60 కిలోల లోపు, బాలికలు 55 కిలోల లోపు బరువుతో, 2009 డిసెంబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని జిల్లా కబడ్డీ సంఘం తెలిపింది.