News November 2, 2025
నూజివీడు రెవిన్యూ డివిజన్.. అటా..ఇటా..?

జిల్లాల విభజనతో ఏలూరు జిల్లాలో చేరిన నూజివీడు రెవిన్యూ డివిజన్‌లో మార్పులు జరిగే అవకాశముంది. ఎన్నికల వేళ చంద్రబాబు నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. నూజివీడు ప్రాంతం విజయవాడను ఆనుకుని ఉందని, తమ ప్రాంతాన్ని ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. నూజివీడును కృష్ణా లేదా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
News November 2, 2025
మణుగూరు దాడి.. భద్రాచలం MLA ఎటువైపు?

తాను BRS పార్టీలోనే ఉన్నానని స్పీకర్‌కు తెలిపిన భద్రాచలం MLA తెల్లం వెంకటరావు ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మణుగూరులోని BRS కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించకపోవడం చర్చనీయాంశమైంది. దాడిని ఖండించక పోవడం, మద్దతు ప్రకటించకపోవడంపై BRS శ్రేణులు, సామాన్య ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తారో లేదో చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
News November 2, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు SP కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు ఆదివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాల్లో మన అప్రమత్తతే మనకు రక్షని సూచించారు.


