News December 2, 2025

నేడు చెన్నైలో IGNITION సదస్సు.. ముఖ్య అతిథిగా KTR

image

చెన్నైలో ఇవాళ జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘IGNITION’ సదస్సులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలు పంచుకోనున్నారు. నేషనల్ పాలిటిక్స్‌పైనా KTR కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.

Similar News

News December 2, 2025

హైదరాబాద్ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగాలు

image

హైదరాబాద్ <>దూరదర్శన్ <<>>కేంద్రం 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. న్యూస్ రీడర్లకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 2, 2025

దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News December 2, 2025

థియేటర్లలో రొమాన్స్.. టెలిగ్రామ్‌లో వీడియోలు

image

థియేటర్లలో జంటలు సన్నిహితంగా ఉండే వీడియోలు టెలిగ్రామ్, Xలో దర్శనమివ్వడం కేరళలో కలకలం రేపింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో CCTV ఫుటేజీలు హ్యాక్ అయ్యాయి. సరైన సెక్యూరిటీ నెట్‌వర్క్ వ్యవస్థ లేకపోవడంతో ఈజీగా హ్యాక్ అయినట్లు నిపుణులు తెలిపారు. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్, బలమైన నెట్‌వర్క్, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని చెబుతున్నారు.