News November 14, 2025

నేను టీటీడీ ఉద్యోగిని కాను: రవి కుమార్

image

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ, రవికుమార్ ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీతో విచారణ చేయాలనే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రవికుమార్ వాజ్యం వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరకామణి వ్యవహారంలో సుమోటో వ్యాజ్యంను మేమే విచారిస్తామని సీజే బెంచ్ తెలిపింది. అయితే నేను టీటీడీ ఉద్యోగిని కాను, నిర్వచనం పరిధిలోకి రాను, ఏసీబీ విచారణ ఆపాలని కోరారు.

Similar News

News November 14, 2025

15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.

News November 14, 2025

గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.

News November 14, 2025

గుంటూరులో ఉగ్రవాద లింకులు?

image

గుంటూరులో ఉగ్ర లింకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘావర్గాల సమాచారంతో ముంబైకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నిన్న ఉదయం నుంచి నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు పలు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. పట్టణంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని, పలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని గుంటూరు జిల్లా పోలీసు శాఖ పేర్కొంది.