News November 14, 2025
నేరేడుచర్ల ఎస్సైకి ఎస్పీ అభినందన

నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సందర్భంగా ఎస్పీ నరసింహ, ఎస్సై రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి మరణించిన బాలిక మృతదేహాన్ని వెలికితీయడంలో ఎస్సై రవీందర్ వేగంగా స్పందించి, బాధ్యతతో పనిచేసినందుకు ఈ ప్రశంసలు లభించాయి. పోలీసు బృందం సమయస్ఫూర్తి ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News November 14, 2025
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఆత్మీయ వీడ్కోలు

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.


