News November 14, 2025
పరకామణి చోరీ కేసులో విచారణ వేగవంతం

తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ బృందం విచారణ వేగవంతం చేసింది. శుక్రవారం మాజీ వీజీవో బాలిరెడ్డి, సీఐ చంద్రశేఖర్ సహా చోరీ జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఇతర ఉద్యోగులను విచారిస్తున్నారు. ఉదయం టీటీడీ జేఈవో కూడా వచ్చి వెళ్లినట్లు సమాచారం. మాజీ AVSO <<18285119>>సతీశ్ మృతి<<>>తో కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Similar News
News November 14, 2025
నస్పూర్: ఆరోగ్యకర అలవాట్లతో మధుమేహం నియంత్రణ

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, రక్తపోటును నియంత్రించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నస్పూర్‌లో అధికారులు, సిబ్బందికి నిర్వహించిన మధుమేహం, రక్తపోటు పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 24,430 మందిలో మధుమేహాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
News November 14, 2025
వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.
News November 14, 2025
టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ <


