News November 28, 2025
పరిశ్రమల ఏర్పాటుకు తక్షణమే అనుమతులు: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలు, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
Similar News
News December 2, 2025
క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

పట్టణ ప్రాంతాలలో అనధికార లే అవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో ఆయన మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. అనధికార ఆక్రమణలను లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలన్నారు.
News December 2, 2025
మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.
News December 2, 2025
కృష్ణా: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకిలాకు వెళుతున్న ఆటో అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. డ్రైవర్ దేశి నాగరాజు (50) స్పాట్‌లోనే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు.


