News November 19, 2025
పల్నాడులో 2,40,530 మంది రైతులు అర్హులు

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం బుధవారం రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేయనుంది. 2,40,530 మంది రైతుల ఖాతాలో రూ.168,37 కోట్లు జమ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. నియోజకవర్గం వారీగా.. సత్తెనపల్లి 36,752, నరసరావుపేట 20,463, చిలకలూరిపేట 21,669, పెదకూరపాడు 41,149, గురజాల 35,676, వినుకొండ 45,898, మాచర్ల 38,923 రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.7000 ఆర్థిక సహాయం చేస్తుంది.
Similar News
News December 9, 2025
కామారెడ్డి: 3వ విడత.. అభ్యర్థుల జాబితా ప్రకటన నేడే

కామారెడ్డి జిల్లాలో 3వ విడతలో భాగంగా బాన్సువాడ, బీర్కూరు, డోంగ్లి, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్గల్ మండలాల్లో బరిలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు నేడు ప్రకటించనున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల లెక్క తేలనుంది. పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్లు రావడంతో ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉంది.
News December 9, 2025
వరంగల్: 32 మంది డాక్టర్లు.. రూ.100 కోట్లు ఫట్

ఉమ్మడి WGLలో వైద్యుల అత్యాశ సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది. పరకాలలో వెలుగు చూసిన రూ.2.51 కోట్ల సైబర్ కేసు తర్వాత అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 32 మంది వైద్యులు సైబర్ వలకు చిక్కారు. MONARCH FIN యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలని, పెట్టుబడిపై 5 నుంచి 20 శాతం అదనంగా చెల్లిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో వల వేయడంతో 32 మంది వైద్యులు చిక్కారు. రూ.100 కోట్లకు పైనే కొల్లగొట్టినట్లు సమాచారం.
News December 9, 2025
మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.


