News December 9, 2025
పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.
Similar News
News December 9, 2025
టీవీని రిమోట్‌తో ఆఫ్ చేసి వదిలేస్తున్నారా?

రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసినప్పటికీ ప్లగ్‌ని అలాగే ఉంచడం వల్ల నిరంతరంగా విద్యుత్తు వినియోగమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట TV ప్లగ్‌ను తీసేస్తే విద్యుత్ వృథాను తగ్గించవచ్చు. అలాగే ఇది షార్ట్ సర్క్యూట్‌ల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. టీవీతో పాటు, సెట్-టాప్ బాక్స్‌లు, ఛార్జర్‌ల ప్లగ్‌లను కూడా అవసరం లేనప్పుడు తీసివేస్తే కరెంటు ఆదా అయి, బిల్లు తక్కువగా వస్తుందంటున్నారు. share it
News December 9, 2025
వంటింటి చిట్కాలు

* పాయసం చేసేటప్పుడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* అన్నం అడుగంటకుండా ఉండాలంటే దానిలో నెయ్యి, కాస్త నిమ్మరసం కలిపితే సరి. అన్నం తెల్లగా, పొడిపొడిగానూ అవుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* ఉల్లిపాయలను, బంగాళాదుంపలను విడివిడిగా పెట్టకపోతే తేమ కారణంగా రెండూ పాడవుతాయి.
News December 9, 2025
స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.


