News December 8, 2025
పాలమూరు: ఓటు గోప్యం.. వెల్లడిస్తే నేరం..!

పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత ఏ అభ్యర్థికి ఓటు వేశారో అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే పద్ధతిని పాటించకపోతే ఎన్నికల నియమావళి 49ఏ ప్రకారం ఓటు వేయనీయరు. పోలింగ్ కేంద్రాల్లో అనుచిత ప్రవర్తనకు పాల్పడితే చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. # SHARE IT
Similar News
News December 9, 2025
ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం డిస్కం నూతన కమిటీని విశాఖలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్.సాయిబాబు, అధ్యక్షుడిగా ఎం.నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకటరావు ఎన్నికయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేళ్లు కొనసాగుతుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సాయిబాబు తెలిపారు.
News December 9, 2025
రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

AP: పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా ₹40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని CBN అధికారులకు సూచించారు. ₹20 వేల కోట్ల చొప్పున నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రకాశం, రాయలసీమలో 20L ఎకరాల్లో ఉద్యాన పంటల్ని విస్తరించాలని చెప్పారు. ₹58,700 CRతో చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో 200 TMCల గోదావరి నీటిని వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.
News December 9, 2025
VZM: జిల్లాలోని ఆప్కో దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సాహించాలన్నారు.


