News December 9, 2025

పాలమూరు: ఓటు వేయాలంటే 10 కి.మీ నడవాల్సిందే..!

image

నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తీవ్రంగా కష్టపడుతున్నారు. వరహాబాద్, మల్లాపూర్ చెంచులు మన్ననూరుకు, కొమ్మన పెంట, కొల్లం పెంట ఓటర్లు దట్టమైన అడవిలో 10 కిలోమీటర్లు నడవాలి. గిసుగండి ఓటర్లు మద్దిమడుగు రావడానికి కూడా 10 కిలోమీటర్లు నడక తప్పడం లేదు.

Similar News

News December 9, 2025

దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

image

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.

News December 9, 2025

బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

image

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్‌ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.