News November 12, 2025
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని చోడవరం తరలింపు

వడ్డాదిలో <<18264743>>పిచ్చికుక్క <<>>దాడితో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో చోడవరం CHCకి తరలించినట్లు డాక్టర్ రమ్య తెలిపారు. వడ్డాది PHCలో రేబీస్ వ్యాక్సినేషన్, ప్రథమ చికిత్స అనంతరం బాధితులను తరలించామన్నారు. కాగా పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారి సంఖ్య 15కి చేరుకుంది. గాయపడిన వారు ఒక్కొక్కరు ఆసుపత్రికి వస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News November 12, 2025
సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం

సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం రేపింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ZHB-బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన లోడ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమంటూ దుండగులు లారీని ఆపి, లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి నుంచి రూ.42 వేల నగదు ఎత్తుకెళ్లారు. న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 12, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు

APలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి యజమాని డా.ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు ఫైల్ చేశారు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. పద్మ, సత్య డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా మరణించింది.
News November 12, 2025
SRCL: డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్‌ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.


