News November 2, 2025
పెంబి: గుంతలో పడి చిన్నారి మృతి

ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలో పడి చిన్నారి నాగపుష్ప(6) మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్(D) పెంబి (M) వేనునగర్‌లో జరిగింది. ఎస్ఐ హన్మాండ్లు తెలిపిన వివరాలు.. ఆత్రం రాము-రేణుక దంపతుల కుమార్తె నాగపుష్ప శనివారం సాయంత్రం అంగన్వాడీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News November 2, 2025
BREAKING: HYD: నవీన్ యాదవ్‌పై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. BRS పార్టీ కేడర్‌ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. BRS కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని, వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు.

KMR: TGTA, TGRSA రాష్ట్ర సమావేశానికి జిల్లా ఉద్యోగులు

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల రెవిన్యూ ఉద్యోగులు ఆదివారం యాదగిరిగుట్టలో జరుగుతున్న తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్(TGTA), తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్(TGRSA) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుటకు ఈ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు.