News November 19, 2025

పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

Similar News

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.

News December 7, 2025

చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మ.2 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు, బుధవారం సా.4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.30కు చర్లపల్లికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

News December 7, 2025

మంచిర్యాల-పెద్దంపేట మధ్య రైలు కింద పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాల-పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. మృతుని వయసు 40 నుంచి 45 ఏళ్లు ఉండగా.. టీ షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ తరలించి జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు సమీపంలోని స్టేషన్లు సంప్రదించాలని సూచించారు.