News December 8, 2025

పెద్దపల్లి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ అవకాశం!

image

ఒకప్పటి అసెంబ్లీ నియోజకవర్గమైన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో సర్పంచ్ పదవికి 23ఏళ్ల తర్వాత మళ్లీ BCలకు అవకాశం లభించింది. 2002లో సర్పంచ్ పదవి BC(జనరల్) అభ్యర్థికి కేటాయించగా మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సాన రాజలింగయ్య గెలుపొందారు. తిరిగి సైతం BC(జనరల్)కు రిజర్వు కావడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు రిటైర్డ్ టీచర్ కాగా, నలుగురు యువకులు ఉన్నారు.

Similar News

News December 9, 2025

జైనూర్‌లో గురువారం వారసంతా వాయిదా

image

స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జైనూర్‌లో జరిగే గురువారం వారసంతా, మార్కెట్ బంద్ చేయాలని తహశీల్దార్ అడా బిర్సావ్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినవారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించాలని, బంద్‌కు సహకరించాలని సూచించారు.

News December 9, 2025

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ములుగు కలెక్టర్ దివాకర పరిశీలించారు. గోవిందరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏటూరునాగారంలోని ఎంపీడీవో కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. సామగ్రి జరిగే పంపిణీ సమయంలో పొరపాటు లేకుండా చూసుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, పేపర్లను సిబ్బందికి అందజేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు వెంట ఉన్నారు.

News December 9, 2025

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(<>ICMR<<>>)7 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును MBBS, MD/MS, PhD, B.V.Sc&AH, MVSc& AH, పీజీ(బయో మెడికల్ సైన్సెస్), ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.icmr.org.in