News November 12, 2025

పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

image

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

Similar News

News November 12, 2025

‘ఉరి’ని తొలగించడంపై SCలో JAN 21న విచారణ

image

నేరాలకు విధించే మరణశిక్షలో ఉరితీసే పద్ధతిని తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 2026 జనవరి 21కి వాయిదా వేసింది. ఎక్కువ బాధను కలిగించే ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్, విద్యుత్ షాక్ తదితర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పిటిషనర్ కోరారు. అయితే విచారణ వచ్చే ఏడాది చేపట్టాలన్న అటార్నీ జనరల్ వెంకటరమణి విజ్ఞప్తితో SC వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

News November 12, 2025

దేహమే శివాలయం అని చెప్పే శ్లోకం

image

‘దేహం దేవాలయం ప్రోక్తం జీవో దేవ ‘స్సనాతన:’’
ఈ శ్లోకం ప్రకారం.. మన శరీరమే ఒక దేవాలయం. ఈ ఆలయంలో నివసించే ప్రాణం సాక్షాత్తూ పరమశివుడే! మన జీవం, పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం అంతా ఈశ్వరుడే. ఇదే శివతత్వం ముఖ్య సారాంశం. నిజమైన యోగి సాధన ద్వారా ఈ శరీర రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు. పంచభూతాలకు అతీతంగా ఉండే పరమ సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ జీవుడు శివయోగిగా మారి, శివుడితో ఏకమవుతాడు. <<-se>>#SIVA<<>>

News November 12, 2025

ఆయిల్‌పామ్.. మొక్కలను ఎంపికలో జాగ్రత్తలు

image

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.