News November 12, 2025
‘పోలీస్ ఉద్యోగి సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్ చేయాలి’

పోలీస్ ఉద్యోగి సర్వీస్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగవంతంగా ఆన్‌లైన్ చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన ఈఎస్ఎం ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈనల 30 నాటికి ప్రతి పోలీస్ ఉద్యోగి పూర్తి వివరాలు ఈఎస్ఎం (ఎంప్లాయీ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్)లో పొందుపరచాలన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే సిబ్బంది తమ వివరాలను స్వయంగా తెలుసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు.
Similar News
News November 12, 2025
ఒక్కో అంతస్తు ఎన్ని అడుగులు ఉండాలి?

ఇంటి నిర్మాణంలో ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం 10.5 నుంచి 12 అడుగుల మధ్య ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ కొలత పాటించడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయంటున్నారు. ‘ఇది ఇంట్లో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచి, నివాసితులకు ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తక్కువ ఎత్తు ఉన్న అంతస్తులు నిరుత్సాహాన్ని, ఇరుకుతనాన్ని కలిగిస్తాయి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 12, 2025
HYD: మంచినీరు సరఫరా.. లెక్కల్లోకి రాని 33% నీరు..!

మహానగర పరిధిలో జలమండలి మంచి నీరు సరఫరా చేస్తోంది. సరఫరా కోసం దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, భారీగా వ్యయం ఖర్చు చేస్తోంది. అయితే.. నీటిలో 33% లెక్కల్లోకి రాకుండా పోతుంది. ఇది జలమండలిపై ప్రభావం చూపుతుంది. కోట్ల మందికి తాగునీటి సరఫరా చేస్తుండగా, లీకేజీలతో పాటు, HYDలో పలుచోట్ల నీటి లెక్కలు తప్పుతున్నాయి.
News November 12, 2025
HYD: రేపే ఫీజు చెల్లింపు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.


