News December 9, 2025
పోస్టల్ బ్యాలెట్‌ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

రెండవ, మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులకు వెళ్లే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ సూచించారు. రెండవ విడత మండలాల్లో డిసెంబర్ 7-10, మూడవ విడత మండలాల్లో 10,12,13,15 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.
News December 9, 2025
పార్వతీపురం: జేసీ నాయకత్వంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం

రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు శత శాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. ఇది రెవెన్యూ క్లినిక్ అతిపెద్ద విజయమని, ఎవరికైనా సమస్యలు ఉంటే సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రతినిధులకు రిటర్న్ గిఫ్టులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులకు రాష్ట్ర వైభవాన్ని చాటే ప్రత్యేక సావనీర్‌లు(గిఫ్ట్స్) అందించారు. వీటిలో సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ చీర, ముత్యాల నగరానికి ప్రతీకగా ముత్యాల చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ కళాకారులు చేతితో చేసిన లక్క గాజులు, సుగంధ సంప్రదాయాన్ని తెలిపే హైదరాబాద్ అత్తర్, రాష్ట్ర వారసత్వ సంస్కృతిని తెలిపే చేర్యాల పెయింటింగ్ చెక్క బొమ్మలు ఉంచారు.


