News November 1, 2025

ప్రైవేటు ఆలయాల భద్రత, నిర్వహణపై ప్రశ్నలు..

image

కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనతో ప్రైవేటు ఆలయాల నిర్వహణ తీరుపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భక్తి, గుర్తింపు తదితర కారణాలతో ఇటీవల కొందరు భారీ స్థాయిలో గుళ్లు కడుతున్నారు. భారీ, ఆకట్టుకునే నిర్మాణం, విగ్రహాలు, లైటింగ్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు విపరీతంగా వెళ్తున్నారు. ప్రైవేటు నిర్వహణలోని ఆ ఆలయాల్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే నష్ట నివారణ చర్యలున్నాయా? లేదా? ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలి.

Similar News

News November 2, 2025

కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

image

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్‌ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.

News November 2, 2025

NHIDCLలో 34 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(<>NHIDCL<<>>)లో 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ, గేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 34ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ. 50000 నుంచి రూ.1,60,000 అందుతుంది. వెబ్‌సైట్: https://www.nhidcl.com/

News November 2, 2025

దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

image

TG: వికారాబాద్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.