News November 2, 2025
ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇవి రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, రెండోది ఇన్ సాల్యుబుల్ ఫైబర్. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా., స్త్రీలకు 25 గ్రా., 2-5 ఏళ్ల పిల్లలకు 15 గ్రా., 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా. ఫైబర్ అవసరం అవుతుంది.
Similar News
News November 2, 2025
BREAKING: సుందర్ విధ్వంసం.. భారత్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూర్య సేన 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో సుందర్ (23 బంతుల్లో 49*), జితేశ్ శర్మ (13 బంతుల్లో 22*) మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు టిమ్ డేవిడ్, స్టాయినిస్ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్ చేసింది. దీంతో 5 టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.
News November 2, 2025
తొలి ‘గే’ ప్రధానిగా రాబ్ జెట్టెన్!

నెదర్లాండ్స్ ఎన్నికల్లో D66 సెంట్రిస్ట్ పార్టీ ఇటీవల ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38ఏళ్ల రాబ్ జెట్టెన్ ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఆ దేశ పిన్న వయస్కుడు, తాను ‘గే’ అని బహిరంగంగా చెప్పుకున్న రాబ్ PMగా నిలిచి రికార్డులకెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని, గొప్ప బాధ్యత తమపై ఉందని ఆయన తెలిపారు. కాగా అర్జెంటీనా హాకీ ఆటగాడు నికోలస్‌తో జెట్టెన్ ఎంగేజ్‌మెంట్ 3ఏళ్ల కిందటే జరిగింది.
News November 2, 2025
ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.


