News November 14, 2025

బాలల దినోత్సవం.. వరంగల్ పోలీసుల సందేశం

image

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీసులు పిల్లల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. సైబర్ ముప్పులు, వేధింపుల నుంచి రక్షించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతి పౌరుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. పిల్లల భవిష్యత్తు రక్షణలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు.

Similar News

News November 14, 2025

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు ఉండి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డివిజన్ల వారీగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రిగా ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, రోహిన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

News November 14, 2025

అన్నమయ్య: 20 ఎర్రచందనం దుంగలు.. ఇన్నోవా సీజ్

image

అన్నమయ్య జిల్లాలోని శేషచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. కాగా పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దుంగలు, వాహనం విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు.

News November 14, 2025

‘క్రెడిట్’ రాజకీయం.. BRS ఓటమికి కీలక కారణం?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బాధ్యత KTRకు అప్పగించడం కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని టాక్. గెలిస్తే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని దూరంగా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ MLAలు ఆయనతో కలిసి రాలేదని కొంతమంది శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటు హరీశ్ రావు తన తండ్రి మరణంతో ఏమీ చేయలేకపోయారు. ఇక కిందిస్థాయి కేడర్‌ను కవిత కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. అంతాకలిసి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.