News November 14, 2025

మాజీ AVSO సతీశ్‌ మరణంపై YCP ట్వీట్

image

మాజీ <<18284097>>AVSO సతీశ్‌<<>>ది ఆత్మహత్యే అని ఆయన సన్నిహితులు చెప్పారంటూ YCP ట్వీట్ చేసింది. ‘సతీశ్ మరణానికి ముందు గోడును సన్నిహితుల వద్ద వెళ్లబోసుకున్నాడట. పరకామణి కేసులో సిట్‌ బృందం అప్పటి CIలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సతీశ్ కుమార్, SI లక్ష్మిరెడ్డిని వేధించి విచారణలో తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేశారట. వీటిని తట్టుకోలేకే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అన్నారు’ అంటూ రాసుకొచ్చింది.

Similar News

News November 14, 2025

డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్‌రెడ్డి

image

TG: దేశ ప్రజలు కాంగ్రెస్‌కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.

News November 14, 2025

ఫలించని రాహుల్ యాత్ర.. అన్నింటా వెనుకంజ!

image

‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో ఇటీవల బిహార్‌లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోటా కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్‌లో ఉండటం గమనార్హం.

News November 14, 2025

PDPL: మహిళా సంఘాల బలోపేతానికి కలెక్టర్ కీలక ఆదేశాలు

image

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆదేశించారు. సెర్ఫ్ కార్యకలాపాల సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంఘం ఆదాయ మార్గాలు పెంచాలని, బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. స్త్రీనిధి రుణాల పంపిణీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ అభినందించారు. నాణ్యతతో ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.