News November 2, 2025
మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డాన్స్ చేస్తారు: రాహుల్

ఓట్ల కోసం ప్రధాని మోదీ డ్రామా ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత హామీలను నెరవేర్చరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ఓట్ల కోసం PM యోగా చేయమన్నా చేస్తారు. కొన్ని ఆసనాలు వేస్తారు. కానీ ఎన్నికలయ్యాక సింగింగ్, డాన్సింగ్ అంతా అదానీ, అంబానీ చేస్తారు. ఇదంతా ఓ నాటకం’ అని ఆరోపించారు. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలు ఆయన్ను నియంత్రిస్తున్నారని బిహార్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.
Similar News
News November 2, 2025
బిగ్‌బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News November 2, 2025
హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్‌ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.
News November 2, 2025
నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.


