News December 7, 2025

రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

image

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.

Similar News

News December 7, 2025

NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (<>NDMA<<>>) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, అట్మాస్పియరిక్ సైన్స్, జియోగ్రఫీ), ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ndma.gov.in./

News December 7, 2025

అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

image

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.

News December 7, 2025

విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

image

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.