News November 14, 2025
రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News November 14, 2025
బెంగాల్, UPలో ఈ గేమ్ సాగదు: అఖిలేశ్ యాదవ్

బిహార్‌లో SIR పేరుతో ఆడిన గేమ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ, ఇతర రాష్ట్రాల్లో ఇకపై సాగదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎన్నికల కుట్ర బయటపడిందని ఆరోపించారు. ‘వాళ్ల ఆటలు సాగనివ్వం. అలర్ట్‌గా ఉంటాం. బీజేపీ చర్యలను అడ్డుకుంటాం. బీజేపీ అంటే పార్టీ కాదు.. మోసం’ అని ట్వీట్ చేశారు. కాగా బిహార్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది.
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.
News November 14, 2025
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.


