News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలింగ్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతా నగర్‌లో ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ఉన్నతాధికారులు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేందుకు పటిష్ఠ బందోబస్తు భద్రతను ఏర్పాటుచేశారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
Similar News
News February 27, 2025
మే 2న కేదార్‌నాథ్ ఆలయం ఓపెన్

చార్‌ధామ్ యాత్రలో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.
News February 27, 2025
మహా నగరంలో.. మహా శివరాత్రి ఎఫెక్ట్

ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోయే మహానగరపు రోడ్లు ఇవాళ కాస్త ఖాళీగా కనిపించాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో జాగరణలో గడిపారు. ఈ ఎఫెక్ట్‌తో ఉదయం లేట్‌గా రోడ్లపైకి వస్తుండటంతో 11 తర్వాత వాహనాలు పెరిగాయి. JNTU, మియాపూర్, బాచుపల్లి, మాదాపూర్, సికింద్రాబాద్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ABIDS, DSNR వంటి బిజీరోడ్లపై ఇప్పుడిప్పుడే హారన్‌మోతలు పెరిగాయి. మీప్రాంతంలో రద్దీగా ఉందా? కామెంట్ చేయండి.
News February 27, 2025
సంగారెడ్డిలో ఓటింగ్ శాతం ఇలా..

సంగారెడ్డి జిల్లాలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం10 గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ 8.05 శాతంగా టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ 12.94గా నమోదైనట్లు కలెక్టర్ క్రాంతి తెలిపారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.