News November 14, 2025

రాజుపేట అబ్బాయికి దక్షిణ కొరియా అమ్మాయితో పెళ్లి

image

వీఆర్ పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన నాగేంద్ర ప్రసాద్ దక్షిణ కొరియాకు చెందిన MIN.KYONGతో వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు తెలిపారు. అక్కడే సాఫ్ట్ వెర్ జాబ్ చేస్తున్న నాగేంద్ర ప్రసాద్‌కు పరిచయమైన ఆమెను సీయోల్‌లో బౌద్ధ మత ఆచార పద్ధతి లో వివాహం చేసుకున్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగిందన్నారు. పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News November 14, 2025

హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

image

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం, కడపలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓర్వకల్లులో క్రియేటివ్‌ సెన్సార్‌ ఇంక్‌ సంస్థ ఇమేజ్‌ సెన్సార్‌ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది.