News October 25, 2024
రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా కంపెనీ ఆసక్తి: మంత్రి
మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూ ఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణాలో కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొరియా నుంచి వచ్చిన షూ ఆల్స్ ఛైర్మన్ సచివాలయంలో మంత్రిని కలిసి తెలంగాణలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని వివరించింది.
Similar News
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.
News November 23, 2024
HYD: WOW.. అందర్నీ ఆకట్టుకున్న రచన
హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.