News November 2, 2025

రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

image

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్‌లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.

Similar News

News November 2, 2025

‘RSS బ్యాన్’ వ్యాఖ్యలు.. ఖర్గేకు అమిత్ షా కౌంటర్

image

RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. RSSను ‘దేశభక్తి సంస్థ’ అని కొనియాడారు. ‘దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాలాంటి ఎంతో మందికి RSS స్ఫూర్తినిచ్చింది. దేశభక్తి, క్రమశిక్షణను పెంపొందించింది. ఉత్తమ PMల జాబితాలో నిలిచే వాజ్‌పేయి, మోదీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు’ అని చెప్పారు. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదన్నారు.

News November 2, 2025

ఈనెల 6న పార్వతీపురంలో మెగా జాబ్ మేళా

image

AP: పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఈనెల 6న కార్మిక& ఉపాధిశాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 6 కంపెనీలలో 740 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్ , డిగ్రీ అర్హతగల 18 నుంచి 30ఏళ్ల వయసు గలవారు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా నేషనల్ కెరీర్ సర్వీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

News November 2, 2025

బొప్పాయి రాబడిని తగ్గించే రింగ్ స్పాట్ వైరస్

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్‌లో పంటకు సరైన ధర దక్కదు.