News February 4, 2026
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

భారత్, చైనాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరినట్లు ఆ దేశ దౌత్యవేత్త ఫియాంగ్ వెల్లడించారు. 2025లో $155 బిలియన్ల విలువైన ట్రేడ్ జరిగిందన్నారు. 2024తో పోల్చితే ఇది 12% అధికమన్నారు. పొరుగు దేశాల మధ్య ఆర్థిక సహకారం మెరుగుపడటానికి ఇదొక సంకేతమని చెప్పారు. ‘బ్రిక్స్‌లో IND నేతృత్వానికి మద్దతు ఇస్తాం. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పర్యటించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. చైనాపై అడ్డగోలుగా టారిఫ్‌లు వేయడం వాటికి ప్రతిగా బీజింగ్ సైతం సుంకాలతో ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య జరగనున్న దౌత్యపరమైన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టాటా పంచ్ ఈవీ కొత్త వెర్షన్.. మిడిల్ క్లాసే టార్గెట్!

మిడిల్ క్లాస్ మార్కెటే లక్ష్యంగా టాటా మోటార్స్ పంచ్ ఈవీలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం బడ్జెట్ కార్లలో ఈవీలకు అంతగా డిమాండ్ లేకపోవడంతో దానిని బ్రేక్ చేయాలని టాటా భావిస్తోంది. అందుకే ప్రారంభ ధర ₹9.69లక్షలకే (ఎక్స్-షోరూమ్) సెట్ చేసింది. battery-as-a-service ఆప్షన్ ఉండటంతో కారు ₹6.49లక్షలకే రానుంది. కేవలం కారుకే డబ్బు చెల్లించి, బ్యాటరీకి <<19172419>>అద్దె<<>> రూపంలో చెల్లించేది ఈ Baas కాన్సెప్ట్.