News November 29, 2025
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్: కలెక్టర్

గ్రామ పంచాయతీల రెండో విడత ఎన్నికల నిర్వహణకు ఆదివారం ఉదయం 10:30 గంటలలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
Similar News
News December 2, 2025
సిరిసిల్ల: అందని సర్టిఫికెట్లు.. ఉత్కంఠలో అభ్యర్థులు

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు పెద్ద సవాలుగా మారింది. సర్వర్ పని చేయకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. మ్యాన్యువల్‌గా సర్టిఫికెట్లు జారీచేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మూడో విడత నామినేషన్‌లు రేపటి నుంచే మొదలుకానున్నాయి. సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడంతో అనుకున్న ముహుర్తానికి నామినేషన్ వేస్తామో లేదో అని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
News December 2, 2025
MBNR: సైబర్ నేరాలకు పాల్పడితే..1930కు ఫోన్ చేయండి

సైబర్ నేరాలకు బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ రూపం మార్చుకుంటున్నాయి. ఒక్క క్లిక్‌తో పెద్ద నష్టం చోటుచేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలన్నారు.
News December 2, 2025
DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్‌నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.


