News November 29, 2025
రైతులకు ఇబ్బందులు రాకూడదు: కొండపల్లి

రైతులకు ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది 3.35 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం పెట్టగా ఈ సంవత్సరం 4 లక్షల టన్నులకు లక్ష్యాన్ని పెంచినట్టు తెలిపారు. ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తోందని చెప్పారు.
Similar News
News December 2, 2025
బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.