News November 12, 2025

రోహిత్ టార్గెట్.. ఫిట్‌నెస్, 2027 వరల్డ్ కప్!

image

2027 ODI వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవాలని రోహిత్ శర్మ గట్టి పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడనున్నట్టు ప్రకటించడం అందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పక ఆడాల్సిందేనని BCCI రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బరువు తగ్గిన హిట్‌మ్యాన్.. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

Similar News

News November 12, 2025

26/11 తరహా దాడులకు ప్లాన్?

image

2008లో ముంబైలో జరిగిన 26/11 తరహా దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ టెంపుల్ సహా ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం. పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ కూడా ఈ లిస్టులో ఉన్నట్లు నిఘావర్గాలు తెలిపాయి. రిపబ్లిక్ డే రోజు దాడులకు ప్లాన్ చేశారని, కట్టుదిట్టమైన భద్రత, నిఘా వల్ల ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పాయి.

News November 12, 2025

కుటుంబం అంతమైనా బుద్ధి మారలేదు!

image

ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ <<17727105>>కుటుంబం<<>> అంతమైనా ఆ ఉగ్రవాద సంస్థ బుద్ధి తెచ్చుకోవట్లేదు. తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో JeM లింకులు బయటపడ్డాయి. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై అటాక్స్, 2019 పుల్వామా అటాక్‌లో వందలాది అమాయకులను ఆ టెర్రరిస్టులు పొట్టనబెట్టుకున్నారు. JeM నాయకత్వ వికేంద్రీకరణ, పాక్ ISI సపోర్ట్‌తో రెచ్చిపోతున్నారు.

News November 12, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

image

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>