News November 2, 2025
లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.
Similar News
News November 3, 2025
నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తా: KTR

TG: కంటోన్మెంట్ నియోజకవర్గానికి CM రేవంత్ రూ.4 వేలకోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని KTR ఓ ఇంటర్వ్యూలో సవాలు చేశారు. నిరూపించలేకపోతే CM రేవంత్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.
News November 3, 2025
కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్‌లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.
News November 3, 2025
SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.


